రుద్ర భైరవునిగా రుద్రేశ్వర స్వామి దర్శనం

రుద్ర భైరవునిగా రుద్రేశ్వర స్వామి దర్శనం

HNK: కాకతీయుల కళాకట్టడమైన వేయిస్తంభాల దేవాలయంలో కార్తీకమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ, అష్టమి తిథి సందర్భంగా రుద్రేశ్వర స్వామివారికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచి, స్వామికి మహా అన్నపూజ నిర్వహించి, రుద్ర భైరవునిగా అలంకరణ చేశారు. భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.