మంత్రి రోజా సమక్షంలో వైసీపీలోకి చేరిక

తిరుపతి: వడమలపేట మండలానికి చెందిన పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి రోజా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన తనను గుర్తించలేదని పేర్కొన్నారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.