లంకెలపాలెంలో మంచినీటి బోర్లకు డిమాండ్

లంకెలపాలెంలో మంచినీటి బోర్లకు డిమాండ్

VSP: లంకెలపాలెం జంక్షన్‌లో తక్షణమే మంచినీటి బోర్లు ఏర్పాటు చేయాలని మడక శివపార్వతి డిమాండ్ చేశారు. బోర్లు లేక ప్రయాణికులు, కార్మికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎండాకాలంలో నీటి కొరతతో చిన్న వ్యాపారులు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని పేర్కొన్నారు. జీవీఎంసీ అధికారులు స్పందించి జంక్షన్ వద్ద బోర్లు ఏర్పాటు చేయాలని కోరారు.