పుంగనూరులో చేతుల శుభ్రతపై అవగాహన
CTR: పుంగనూరులోని దోబి కాలనీలోని అంగన్వాడి కేంద్రంలో బుధవారం ఆశాలు చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. తర్వాత చేతులను శుభ్రం చేసుకునే విధానాన్ని పిల్లల దగ్గర చేయించారు. చేతుల శుభ్రత ఆరోగ్యానికి మొదటి రక్ష అన్నారు. సబ్బు, నీటితో కనీసం 20 సెకన్ల చేతులు కడుక్కోవడం ద్వారా వైరస్ వంటి సూక్ష్మజీవులను తొలగించవచ్చన్నారు.