మున్సిపల్ ఎన్నికల నగారా.. తొలిరోజు మూడు నామినేషన్లు

మున్సిపల్ ఎన్నికల నగారా.. తొలిరోజు మూడు నామినేషన్లు

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో భాగంగా బుధవారం తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. 26వ వార్డు నుంచి పోలేబోయిన రాధిక, 39వ వార్డు నుంచి గడ్డం భాగ్యలక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయగా.. 43వ వార్డు నుంచి బీఆర్ఎస్ (తెరాస) తరపున బత్తుల ఝాన్సీ లక్ష్మి రమేష్ నామినేషన్ సమర్పించారు.