రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
కోనసీమ: లారీ చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడిన కాట్రేనికోన మండలం అడవిపేటకు చెందిన మల్లవరపు పవన్ (28) మృతి చెందాడని ఉప్పలగుప్తం ఎస్ఐ SK జానీ భాషా తెలిపారు. అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడన్నారు. గురువారం బైక్పై ఇంటికి వెళ్తుండగా ఎన్.కొత్తపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.