పల్లె నిద్రలో పలు అంశాలపై అవగాహన కల్పించిన ఎస్సై
VZM: నెలిమర్ల ఎస్సై గణేష్ నిన్న రాత్రి మండలంలోని పెద బూరాడ పేటలో 'పల్లె నిద్ర' కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామస్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. IPL క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో యువత ఆన్‌లైన్ బెట్టింగులకు దూరంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ బెట్టింగులతో యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు.