మేము క్షేమంగానే ఉన్నాం: ఆంధ్రా వాసులు
AP: ఉమ్రా యాత్రకు వెళ్లిన ఆంధ్రావాసులు ఓ వీడియో విడుదల చేశారు. తామంతా గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి ఉమ్రా యాత్రకు వచ్చామని తెలిపారు. సౌదీలో జరిగిన ప్రమాదం గురించి తెలిసిందని.. అల్లా దయతో తాము మాత్రం క్షేమంగానే ఉన్నామని వెల్లడించారు. యాత్రను పూర్తి చేసుకుని త్వరలోనే స్వస్థలాలకు చేరుకుంటామని స్పష్టం చేశారు.