VIDEO: కురవి వీరభద్రస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దర్శనం కోసం ఆదివారం ఉదయం నుంచే క్యూలైన్లు ఏర్పడ్డాయి. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతుండగా, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామివారి ఆశీర్వాదాలు పొందుతున్నారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.