ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా చేబ్రోలులోని వేజెండ్లలో ఆదివారం రాత్రి ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసి, రంజాన్ పవిత్రత, దానగుణం గురించి ప్రస్తావించారు. ప్రతి ఒక్కరిపై అల్లా ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.