ఎన్నికలపై మాస్టర్ ట్రైనీలకు శిక్షణ కార్యక్రమం

ఎన్నికలపై మాస్టర్ ట్రైనీలకు శిక్షణ కార్యక్రమం

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారిని సుభద్ర అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సాధారణ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించుటకు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చుటకు మాస్టర్ ట్రైనీలకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవీఎంలు, వివి ప్యాడ్లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.