ప్రభుత్వ కార్యాలయాల ప్రక్షాళనపై యంత్రాంగం దృష్టి

ప్రభుత్వ కార్యాలయాల ప్రక్షాళనపై యంత్రాంగం దృష్టి

PPM​: పరిశుభ్రత, మౌలిక వసతులపై తనిఖీ నివేదికలు తప్పనిసరని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ​జిల్లా పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ పరిశుభ్రంగా, మెరుగైన మౌలిక వసతులతో ఉండేలా చూసేందుకు ఆయా శాఖల అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.