పది పరీక్షలు.. విద్యార్థులకు డీఈవో సూచనలు

పది పరీక్షలు.. విద్యార్థులకు డీఈవో సూచనలు

KMR: జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ఒకరోజు ముందు సందర్శించాలని, అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని వివరించారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఉందన్నారు. పాఠశాలల ద్వారా హాల్ టికెట్స్ పొందవచ్చన్నారు.