ఈనెల 31 వరకు ఆసరా పెన్షన్ల పంపిణీ: డీఆర్డీఓ శేఖర్ రెడ్డి

ఈనెల 31 వరకు ఆసరా పెన్షన్ల పంపిణీ: డీఆర్డీఓ శేఖర్ రెడ్డి

NLG: జిల్లాలో ఆసరా పింఛన్లను ఈ నెల 31వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఓ శేఖర్ రెడ్డి తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లు గీత, ఒంటరి మహిళలకు చేయూత, ఆసరా పింఛన్లను ఆయా పోస్టాఫీసుల ద్వారా అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పింఛనుదారులు పింఛను నేరుగా సంబంధిత పోస్టల్ కార్యాలయాల్లో పొందాలని సూచించారు.