వేములవాడ రాజన్న ప్రత్యేకత ఇదే..!
SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వెలసిన శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందు భారీగా భక్తులు తరలివస్తారు. ఈ ఆలయాన్ని చాళుక్యులు నిర్మించారు. స్వామివారికి కోడె మొక్కును సమర్పించడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలోని పవిత్రమైన కోనేరును 'ధర్మగుండం' అని పిలుస్తారు. ఇందులో స్నానం చేయడం భక్తులు శుభప్రదంగా భావిస్తారు.