రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు: కమిషనర్

రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు: కమిషనర్

గుంటూరులో రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాల్లో చెత్త వేయవద్దని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పరిశుభ్రతను పర్యవేక్షించారు. పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటి చెత్త సేకరణ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.