గుంటూరులో 21న తపాలా సేవలు బంద్

GNTR: తపాలాశాఖ అధునాతన అప్లికేషన్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ నెల 21న గుంటూరు డివిజన్‌లోని అన్ని పోస్టాఫీసుల్లో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు గురువారం అధికారులు తెలిపారు. అప్‌గ్రేడ్ చేసిన వ్యవస్థ ద్వారా 22 నుంచి వినియోగదారులకు సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని తెలిపారు.