'రైతులు కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలి'
JGL: రైతులు కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని గొల్లపల్లి ఏఎంసీ ఛైర్మన్ భీమ సంతోష్ అన్నారు. గొల్లపల్లి మండలం రాపల్లిలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొక్కుల జలంధర్ పాల్గొన్నారు.