పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి భేటీ
VSP: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విశాఖ పర్యటనలో ఉన్న వీరిద్దరూ ఒకరినొకరు కలుసుకుని పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.