VIDEO: విద్యార్థులను చీపురుతో చితకబాదిన వంటమనిషి
JGL: జిల్లాలో ఎస్టీ హాస్టల్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ విద్యార్థులను కూరగాయలు కోసే శ్రీనివాన్ చీపురుతో చితకబాదాడు. నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నాడని, నాలుగు నెలలుగా వేధిస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ నిర్వాహకులకు పలు మార్లు విద్యార్థులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.