VIDEO: వినికిడి యంత్రాలు పంపిణీ చేసిన ఎంపీ

VIDEO: వినికిడి యంత్రాలు పంపిణీ చేసిన ఎంపీ

సత్యసాయి: పెనుకొండలో వృద్ధులకు హిందూపురం ఎంపీ పార్థసారథి సోమవారం వినికిడి యంత్రాలు, చేతికర్రలు పంపిణీ చేశారు. పెనుకొండ పట్టణం మడకశిర రోడ్డులోని ఎంపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. సీఎం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంపీ అల్లుడు శశిభూషణ్, కుమారుడు సాయి కళ్యాణ్ పాల్గొన్నారు.