VIDEO: రైతు సేవా కేంద్రాన్ని ముట్టడించిన రైతులు

VIDEO: రైతు సేవా కేంద్రాన్ని ముట్టడించిన రైతులు

కృష్ణా: ముక్కొల్లు గ్రామం రైతులు గత వారం రోజులుగా కల్లాలలో ఎండబెట్టిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆగ్రహంతో గ్రామంలోని రైతు సేవా కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించారు. మూడు గంటలపాటు కార్యాలయం వద్ద రైతులు నిరసన చేపట్టారు.