ఆస్తి పన్ను వసూళ్లలో వినుకొండకు తొలి స్థానం

ఆస్తి పన్ను వసూళ్లలో వినుకొండకు తొలి స్థానం

PLD: వినుకొండ పురపాలక సంఘం ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 95% సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన వర్క్‌షాప్‌లో పురపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, సీడీఎంఏ సంపత్ కుమార్ చేతుల మీదుగా కమిషనర్ కే. శివరామ ప్రసాద్‌ను దుశ్శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు.