త్వరలో రాజధాని రైతులతో సమావేశం: సీఎం

త్వరలో రాజధాని రైతులతో సమావేశం: సీఎం

AP: రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై రాజధాని రైతులకు ఇబ్బందులు రాకూడదని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో రాజధాని రైతులతో సమావేశమవుతానని వెల్లడించారు. రాజధానిలో పచ్చదనం, సుందరీకరణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. గార్డెనింగ్, బ్యూటిఫికేషన్‌లో రాజీ పడొద్దన్నారు. ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు కూడా ఐకానిక్ మోడల్‌లో ఉండేలా చూడాలని సూచించారు.