మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం

మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం

నల్గొండ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం సృష్టించింది. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని.. జూనియర్లు ఫిర్యాదు చేయడంతో సీనియర్లు మరోసారి దాడి చేశారు. 'మీ సంగతి చూస్తాం'అంటూ జూనియర్లపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో వారు మళ్లీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో.. ఇవన్నీ సహజమేనని, సీనియర్లకు ఈగో ఉంటుంది అని హితవు పలికారు.