యుటీఎఫ్ మండల శాఖ అధ్యక్షుడిగా నక్క అప్పయ్య
SKLM: నరసన్నపేట యుటిఎఫ్ మండల కార్యవర్గ సంఘం సమావేశం మంగళవారం సాయంత్రం నరసన్నపేట పిఎం శ్రీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్ మూర్తి ఆధ్వర్యంలో కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా ఉపాధ్యాయులు ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా నక్క అప్పయ్య, జనరల్ సెక్రెటరీగా ఆర్ జగదీశ్వర్ రావు తో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు.