రూ.5 లక్షలు డిమాండ్.. విలేకరులపై కేసు నమోదు
SRCL: జిల్లా కేంద్రంలోని ఓ హాస్పిటల్ యాజమాన్యాన్ని బెదిరించి నగదు డిమాండ్ చేసిన ఐదుగురు విలేకరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రి నిర్వాహకుడు గుడూరి రవీందర్ ఫిర్యాదు మేరకు విలేకరులు రవి, మహేశ్, సంతోశ్, భాస్కర్, ప్రవీణ్‌పై చర్యలు చేపట్టారు. హాస్పిటల్ నడవాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని, లేదంటే తప్పుడు వార్తలు రాసి అప్రతిష్ఠ పాలు చేస్తామని హెచ్చిరించినట్లు తెలిపారు.