ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరికలు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం 1వ డివిజన్, నవలకులతోటకు చెందిన వైసీపీ నేత యనమల హరిబాబు యాదవ్ తన మిత్రబృందంతో కలిసి టీడీపీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంఛార్జ్ కుడుముల చిరంజీవి, తంబి శ్రీనివాసులు పాల్గొన్నారు.