పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
BHPL: చిట్యాల మండలం చల్లగరిగలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానికుడైన రమేష్ (50) మద్యం మత్తులో గ్రామ శివారులోని పల్లె ప్రకృతి వనం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.