శబరి యాత్రకు వెళ్లే స్వాములకు ఆర్టీసీ బస్సులు
KMR: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాములకు తక్కువ ధరకే ఆర్టీసీ బస్సులను సమకూరుస్తామని కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ తెలిపారు. దోమకొండ మండల కేంద్రంలో ఆయన అయ్యప్ప స్వాములను కలిసి యాత్రకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను స్వాములు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.