ప్రాణం తీసిన.. ఉల్లి ధర

KRNL: జిల్లా వెల్దుర్తి మండలం కోసనేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఉల్లి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రూ. 2 లక్షలతో ఉల్లి సాగు చేసిన రైతు రామచంద్రుడు. ఉల్లి ధర దారుణంగా పడిపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు తీరకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.