సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
NLG: దేవరకొండలోని ఎమ్మెల్యే నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన 251 మందికి గాను రూ. 92,61,000 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే బాలునాయక్ ఆదివారం లబ్దిదారులకు పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంలో సీఎం సహాయనిధి ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు.