అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేత

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేత

MNCL: అంగన్వాడి కేంద్రాల సేవలను గర్భిణీలు, బాలింతలు వినియోగించుకోవాలని జన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, తహసీల్దార్ బక్కయ్య, సీడీపీవో రేష్మ కోరారు. జన్నారం మండలంలో పనిచేస్తున్న అంగన్వాడి టీచర్లకు సోమవారం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వం సరఫరా చేసిన స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్ పాల్గొన్నారు.