25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..
విశాఖ జిల్లా ఆనందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. 1998-99లో 10వ తరగతి చదివిన విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వారి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. చదువులు చెప్పిన టీచర్లకు సన్మానం చేశారు.