హత్యకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు: కాకర్ల
NLR: జలదంకి మండలం గొట్టిపాటి ప్రసాద్ నాయుడు హత్య నేపథ్యంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ కావలి ఆసుపత్రికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. MLA మాట్లాడుతూ.. హత్యకు బాధ్యులైన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.