నేడు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పర్యటన
NTR: ఎమ్మెల్యే శ్రీనివాసరావు శుక్రవారం పర్యటన ఖరారైంది. ఉదయం 10 గంటలకు తిరువూరు కార్యాలయంలో CMRF చెక్కులను పంపిణీ చేస్తారు. 11 గంటలకు మల్లెల గ్రామంలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం షాప్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు విస్సన్నపేట మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. సమస్యలను MLA దృష్టికి తీసుకురావాలని కార్యాలయ సిబ్బంది తెలిపారు.