కాగుపాడు సర్పంచికి చెక్కు పవర్ రద్దు

ELR: ఉంగుటూరు(M) కాగుపాడు సర్పంచి కడియాల సుధేష్ణకు చెక్ పవర్ ఆరు నెలల పాటు రద్దు చేసారు. పంచాయతీ నిధులు దుర్వినియోగంపై వార్డు సభ్యుడు వంకిన మాధవరావు ఫిర్యాదు చేయటం పాఠకులకు విదితమే. DPO నూజివీడు డీఎల్డీవో విచారణ అధికారిగా నియమించారు. నిధులు దుర్వినియోగం జరిగిందని నిర్ధారించడంతో సర్పంచ్‌కి చెక్ పవర్ రద్దు చేశారు.