పల్నాడులో వ్యక్తి దారుణ హత్య
PLD: నరసరావుపేట మండలం ములకలూరు శివారులో ఆదివారం పర్వతాలు (55) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు గడ్డపార, కర్రలతో దాడి చేయడంతో పర్వతాలు ఘటనా స్థలంలోనే కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్వగ్రామం అగ్రహారం కాగా, వివాదాల కారణంగా కొన్నేళ్లుగా దేచవరంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.