ప్రభుత్వ ITI ఆవరణలో మినీ జాబ్ మేళా

ప్రభుత్వ ITI ఆవరణలో మినీ జాబ్ మేళా

MNCL: మంచిర్యాలలోని ప్రభుత్వ ITI ఆవరణలో ఈ నెల 9వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ మంగళవారం ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ మంచిర్యాలలో (15), హైదరాబాదులో (100)ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ నెల 9న అర్హులైన అభ్యర్థులు హాజరై జాబ్ మేళాను విజయవంతం చేయాలని కోరారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు