ఆనందోత్సవాలతో సొంతింటిలోకి అడుగులు
RR: షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 7వ వార్డులో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారులు మాట్లాడుతూ.. నిరుపేద స్వప్నాలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ముందడుగు వేసిందని, సొంతింటి కల సాకారం కావడంతో ఆనందోత్సవాలతో సొంతింటిలోకి అడుగులు వేస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్ పాల్గొన్నారు.