చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
స్వదేశీ ఉగ్రవాదంపై కేంద్ర మాజీమంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఉగ్రవాదుల పట్ల కాంగ్రెస్ సానుభూతి ప్రదర్శిస్తుందంటూ ధ్వజమెత్తింది. ఉగ్రవాదులు గాయపడినప్పుడు కాంగ్రెస్ అరవడం ప్రారంభిస్తుందని బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు ఉగ్రవాదుల ప్రతినిధులుగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.