రాంపురంలో యూటీఎఫ్ మోడల్ పేపర్స్ పంపిణీ

రాంపురంలో యూటీఎఫ్ మోడల్ పేపర్స్ పంపిణీ

సత్యసాయి: పెనుకొండ మండలం రాంపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం యూటీఎఫ్ SSC మోడల్ పేపర్స్ పంపిణీ చేశారు. రాంపురం సర్పంచ్ శ్రీనివాసులు సౌజన్యంతో పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా మోడల్ పేపర్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగపద్మజ పాల్గొన్నారు.