పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

ప్రకాశం: పొదిలి నగర పంచాయతీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నారాయణరెడ్డి మొదటిసారి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. బాప్టిస్ట్ పాలెం, చిన్న బస్టాండ్, మెయిన్ రోడ్డు, పొదిలమ్మ నగర్, ఆంజనేయ స్వామి ఆలయ సమీప పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రతీ ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి, పొడి చెత్తను వేరు చేసి డస్ట్ బిన్‌లలో వెయ్యాలి అన్నారు.