6.5 లక్షల మంది భక్తులకు అయ్యప్ప దర్శనం

6.5 లక్షల మంది భక్తులకు అయ్యప్ప దర్శనం

కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఈనెల 16న అయ్యప్ప సన్నిధానం ఆలయ తలుపులు తెరుచుకోగా.. వారం రోజుల్లో 6.5 లక్షల మంది స్వామిని దర్శించుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు ప్రకటించారు. ఆదివారం నుంచి స్పాట్ బుకింగ్‌లను పెంచడంతో.. ఇవాళ భక్తుల తాకిడి మరింత పెరిగింది. భక్తుల శరణుఘోషలతో పంచగిరులు మార్మోగుతున్నాయి.