శ్రీశైలంలో భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం

శ్రీశైలంలో భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం

NDL: శ్రీశైలంలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ టోల్‌గేట్ వద్ద వేగంగా వచ్చిన ఓ వాహనం నియంత్రణ కోల్పోయి అక్కడే ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మందికిపైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది, తోటి భక్తులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.