కొబ్బరి చెట్టుపై పిడుగు

కామారెడ్డి: దోమకొండ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై సోమవారం పిడుగు పడింది. ఉరుములతో కూడిన వర్షం రావడంతో మండలానికి చెందిన రామాచారి నివాసంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చుట్టుపక్కల వారు గమనించి విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు.