VIDEO: పుంగనూరులో ముగిసిన మొహర్రం వేడుకలు

CTR: పుంగనూరులో మొహర్రం వేడుకలు ఆదివారం ముగిశాయి. పట్టణంలోని సుబేదార్ వీధి, కుమ్మర వీధుల్లోని చావిడిలో పీర్లను కొలువు తీర్చి 13 రోజులు పాటు ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు, దువాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం చివరి రోజు కావడంతో భక్తిశ్రద్ధలతో పీర్లను పురవీధుల గుండా ఊరేగిస్తూ.. నిమజ్జనానికి తరలించారు.