సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
SKLM: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం రూరల్ ఎస్సై రాము అన్నారు. సోమవారం రూరల్ మండలం నైరా గ్రామంలో నారీ శక్తి కార్యక్రమం నిర్వహించారు. మహిళల చట్టాలు, గుడ్, బ్యాడ్ టచ్, ఛైల్డ్ మ్యారేజ్ అంశాలపై స్థానిక ప్రజలకు వివరించారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని ఎస్సై తెలిపారు.