ట్రక్కు, బైక్ ఢీ.. యువకుడికి తీవ్రగాయాలు

ట్రక్కు, బైక్ ఢీ.. యువకుడికి తీవ్రగాయాలు

ADB: ఆగి ఉన్న ట్రక్కును బైక్ ఢీకొన్న ఘటన నేరడిగొండ మండలం కుట్టి ఘాట్ వద్ద చోటుచేసుకుంది. సురేష్ (26) అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈఎంటి అనిల్ ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. పైలెట్ నాగోరావు ఈ వివరాలను తెలిపారు.