చెరువుల వద్ద మొక్కలు నాటిన ఎమ్మెల్యే

PLD: అమరావతి మండలం యండ్రాయి గ్రామంలోని చెరువు వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి గ్రామంలో చెరువుల వద్ద, ఇళ్ల వద్ద పచ్చదనం విస్తరించేందుకు ప్రజలు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి మొక్క మనుషులకు అన్నివిధాలా మేలు చేస్తుంది అన్నారు.